అదే మాట నేనంటే శాసనం: బాలయ్య

6 Dec, 2019 13:17 IST|Sakshi

బాలయ్య బాబు జోష్‌ పెంచాడు. వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్న నందమూరి బాలకృష్ణ తన 106వ సినిమాను పట్టాలెక్కించి అభిమానులకు తీపివార్త అంజేశాడు. ఈ సినిమా శుక్రవారం పూజాకార్యక్రమాలతో ఘనంగా లాంచ్‌ అవగా పలువురు సినీపెద్దలు హాజరయ్యారు. ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాలయ్య బాబుపై దర్శకుడు గోపాల్‌ తొలి క్లాప్‌ కొట్టగా, నిర్మాత అంబిక కృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశాడు. ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ బాలయ్య పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో షూటింగ్‌ మొదలు పెట్టారు. ఇక మాస్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించగా మిర్యా రవీందర్‌ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై సినిమా నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వీరు ముచ్చటగా మూడోసారి జత కడుతుండటంతో బాలయ్య ఖాతాలో మరో హిట్‌ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బాలయ్య సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫైనల్‌ చేసినట్లు కనిపించడం లేదు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులను వెల్లడిస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా బాలయ్య తాజాగా నటించిన రూలర్‌ చిత్రం డిసెంబర్‌ 20న విడుదల కానున్న విషయం తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు