గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

18 Oct, 2019 16:37 IST|Sakshi

ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని చిన్నారి గోకుల్‌ కన్నుమూశాడు. డెంగీతో బాధపడుతున్న గోకుల్‌ బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోకుల్‌ మృతిపై బాలకృష్ణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమకు అభిమానుల కంటే విలువైనది మరోకటి ఉండదని బాలకృష్ణ పేర్కొన్నారు. తనంటే ప్రాణం ఇచ్చే  చిన్నారి.. ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం మనసును కలచివేసిందన్నారు. గోకుల్‌ డైలాగ్‌లు చెప్పిన విధానం..హావభావాలు చూసి తనకు ఎంతో ముచ్చటేసేదని తెలిపారు. 

ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి.. ఇంత చిన్న వయసులో డెంగీ వ్యాధితో లోకాన్ని విడిచి వెళ్లడం బాధ కలిగించిందని చెప్పారు. చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలాగే గోకుల్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, బాలకృష్ణ అభిమాని అయిన గోకుల్‌.. ఆయనను చక్కగా అనుకరించడమే కాకుండా పవర్‌ఫుల్‌ డైలాగ్‌లను కూడా అలవోకగా చెప్పగలడు. గోకుల్‌ బాలకృష్ణ డైలాగ్‌లు చెబుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు