నట విశ్వరూపం

5 May, 2015 23:46 IST|Sakshi
నట విశ్వరూపం

 లెజెండ్’ విడుదలైన 413 రోజులకు నందమూరి బాలకృష్ణ ‘లయన్’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సత్యదేవా దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇందులో బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే నాయికలుగా చేశారు. బాలకృష్ణ - సంగీత దర్శకుడు మణిశర్మలది విజయవంతమైన కాంబినేషన్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి మ్యూజికల్ హిట్స్ వీరి కలయికలో వచ్చాయి.

 ఆ జాబితాలోనే ఈ సినిమా కూడా చేరుతుందని సత్యదేవా నమ్మకంగా చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చాటి చెప్పే సినిమా ఇది. సంభాషణలు అదిరిపోయే స్థాయిలో ఉంటాయి. నందమూరి అభిమానులు కోరుకునే అన్ని వాణిజ్య అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ నెల 14 గురువారం ఉదయం 9 గంటల 36 నిమిషాలకు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా