స్క్రిప్ట్‌ రెడీ.. సెట్స్‌కి వెళ్లడమే ఆలస్యం!

4 Feb, 2017 23:25 IST|Sakshi
స్క్రిప్ట్‌ రెడీ.. సెట్స్‌కి వెళ్లడమే ఆలస్యం!

ఓ పక్క తమ్ముడు ఎన్టీఆర్‌ హీరోగా నిర్మించబోయే సినిమా పనులతో బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌.. మరోపక్క తాను హీరోగా నటించనున్న సినిమా కోసం కథలు వింటున్నారు. ‘ఇజం’ తర్వాత పలు కథలు విన్నారాయన. వాటిలో ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్‌ సాధినేని చెప్పిన కథకి కల్యాణ్‌రామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. స్క్రిప్ట్‌ కూడా లాక్‌ చేశారట.

ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేసే జానర్‌లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ నెల 10న ఎన్టీఆర్‌ సినిమా పూజా కార్యక్రమాలు  జరుగుతాయట. 15న ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పవన్‌ సాధినేనితో చేయనున్న సినిమా గురించి కల్యాణ్‌రామ్‌ ప్రకటిస్తారని భోగట్టా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా