మార్చి 1న కళ్యాణ్‌ రామ్‌ ‘118’

11 Jan, 2019 21:19 IST|Sakshi

నందమూరి కల్యాణ్ రామ్‌ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలీష్ యాక్షన్‌ స‌స్పెన్స్ థ్రిల్లర్ `118`.  నివేదా థామస్‌, షాలినీ పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదలకానుంది.

పటాస్‌ సినిమాతో బ్రేక్‌ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు కల్యాణ్ రామ్‌. ఈ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా 118 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ లో కనిపించనుండంతో సినిమాపై అంచానాలు పెరిగాయి. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు