వచ్చే ఏడాది వారసుడొస్తాడు!

6 Sep, 2017 23:51 IST|Sakshi
వచ్చే ఏడాది వారసుడొస్తాడు!

నందమూరి అభిమానులకు శుభవార్త. వాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాది తెరంగేట్రం చేయనున్నాడు. తనయుడి ఎంట్రీకి బాలకృష్ణ ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే... ఆ సినిమాకు దర్శకుడెవరు? నిర్మాత ఎవరు? అనే వివరాలను చెప్పలేదు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది వారసుడి తొలి సినిమా ప్రారంభమవుతుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.