నాన్‌స్టాప్‌

27 May, 2018 00:39 IST|Sakshi
నందితా శ్వేత

ఐదు కాదు. పది కాదు. ఏకంగా ఇరువై గంటలు కెమెరా ముందే ఉన్నారు కథానాయిక నందితా శ్వేత. అవును... ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు ఇరవై గంటల పాటు షూట్‌లో పాల్గొన్నారు నందిత. దీన్ని బట్టీ ఆమె ఎంత అకింతభావంతో వర్క్‌ చేస్తోరో అర్థం చేసుకోవచ్చు. అంతేనా.. ఈ ఏడాది ఆమె సూపర్‌ స్పీడ్‌.. కాదు కాదు జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. మరి.. ఏక కాలంలో ఏడు సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు కదా. ‘‘ఈ ఏడాది లైఫ్‌ రంగులరాట్నంలా తిరుగుతుంది. గత ఆరు నెలల నుంచి ఏక కాలంలో ఏడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను.

నా వర్క్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం నైట్‌ షూట్‌లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు నందితా శ్వేతా. అంటే నందిత నాన్‌స్టాప్‌గా కెరీర్‌లో ముందుకెళ్తున్నారన్నమాట. రెండేళ్ల క్రితం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరపై మెరిశారీ బ్యూటీ. ప్రస్తుతం నితిన్‌ హీరోగా ‘శతమానంభవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు నందిత. మరో కథానాయికగా రాశీఖన్నా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. తమిళ సినిమా ‘నర్మద’లో తల్లి పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారామె.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు