సిబిరాజ్‌కు జంటగా నందితాశ్వేత

22 Sep, 2019 09:59 IST|Sakshi

నటి నందితాశ్వేతాకు నటుడు సిబిరాజ్‌తో జత కట్టే చాన్స్‌ వచ్చింది. అట్టకత్తి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అమ్మడికి ఆ చిత్రం హిట్‌ అయ్యి మంచి పేరే తెచ్చి పెట్టింది. ఆ తరువాత పలు అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కానీ ఎందుకో అందం కూడా కావలసినంత ఉన్నా స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకోలేకపోతోంది. అంతేకాదు స్టార్‌ హీరోలతో రొమాన్స్‌ చేసే అవకాశాలను రాబట్టుకోలేకపోతోంది.

ఇటీవల ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన దేవీ 2 చిత్రంలో ఒక హీరోయిన్‌గా కనిపించింది. ఈ అమ్మడు చివరిగా నటించిన చిత్రం 7. ఈ ద్విభాషా చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా నటుడు సిబిరాజ్‌తో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇంతకుముందు సిబిరాజ్‌ హీరోగా సత్య చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్‌కృష్ణమూర్తి తాజాగా ఆయన హీరోగానే మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో సిబి రాజ్‌ తండ్రి సత్యరాజ్‌ కూడా నటించనున్నారు.

ఇది కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన కావలుదారి చిత్రానికి రీమేక్‌. దీన్ని జీ.ధనుంజయన్‌ నిర్మించనున్నారు. చాలా కాలం తరువాత తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో నటి నందితాశ్వేత జర్నలిస్ట్‌ పాత్రలో నటించనుందట. చిత్రంలో ఆమెకు రొమాంటిక్‌ సన్నివేశాలాంటివేవీ ఉండవట. అయితే కథలో చాలా ముఖ్యమైన పాత్ర అని చిత్ర వర్గాలు అంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు