విద్యా వ్యవస్థలోని వాస్తవాలతో..

18 Nov, 2018 05:37 IST|Sakshi
నందితా శ్వేత, ‘దిల్‌’ రాజు

‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్‌ నందితా శ్వేత ముఖ్య పాత్రలో చిన్నికృష్ణ తెరకెక్కించనున్న చిత్రం ‘అక్షర’. సినిమా హాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అహితేజ బెల్లంకొండ, సురేశ్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహుర్తం శనివారం జరిగింది. తొలి సన్నివేశానికి పారిశ్రామికవేత్త  రఘురామ కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్‌ చేయగా,  నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు సుధీర్‌ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు కార్తికేయ, విజయ్‌ రాహుల్, దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కురసాల స్క్రిప్ట్‌ని నిర్మాతలకు అందించి, శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ – ‘‘కథ వినగానే బాగా ఎగై్జట్‌ అయ్యాను. నిర్మాతల ఆలోచనలు నన్ను ఇంప్రెస్‌ చేశాయి. కథ మీద చాలా నమ్మకంగా ఉన్నాం.

చాలా బాధ్యత గల పాత్ర. కొంచెం భయంగా కూడా ఉంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ఈ బ్యానర్‌ని నిలబెట్టే సినిమా అవుతుంది. విద్యా వ్యవస్థలోని వాస్తవాలకు వినోదం జోడించి చెప్పబోతున్నాం. నందితా శ్వేతాతో పాటు 3 ముఖ్యమైన పాత్రలున్నాయి. త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. ‘‘కాన్సెప్ట్‌ టీజర్‌కి మంచి స్పందన లభించింది. డిసెంబర్‌ సెకండ్‌ వీక్‌లో షూటింగ్‌ మొదలుపెట్టి సమ్మర్‌కి విడుదల ప్లాన్‌ చేస్తున్నాం. ఆడియన్స్‌ ఆలోచనలో మార్పు కలిగించే చిత్రం అవుతుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు అహితేజ, సురేశ్‌ వర్మ. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, కెమెరా: జి.శివ, సహనిర్మాత: కె. శ్రీనివాసరెడ్డి.
 

మరిన్ని వార్తలు