టాలీవుడ్‌లో బిజీబిజీగా..

3 Aug, 2018 09:43 IST|Sakshi

తమిళసినిమా: మాతృభాష నుంచి ఇతర భాషలపై కన్నేయడం అన్నది  హీరోయిన్లకు కొత్తేమీ కాదు. బహుభాషా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటే ఆ క్రేజే వేరు. పారితోషికం విషయంలోనూ డిమాండ్‌ ఉంటుంది. అందుకే చాలా మంది ఇతర భాషల్లోనూ రాణించాలని ఆశ పడుతుంటారు. అయితే అందరికీ అన్ని భాషల్లోనూ అవకాశాలు రావడం జరగదు. అలాంటి అదృష్టం యువ నటి నందిత కు లభించింది. ఈ బ్యూటీ తమిళం, కన్నడం, తెలుగు భాషల్లో ప్రాచుర్యం పొందడం విశేషమే. ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీబిజీగా ఉంది. కబాలి చిత్రం ఫేమ్‌ పా.రంజిత్‌ అట్టకత్తి చిత్రం ద్వారా పరిచయం చేసిన నటి నందిత. ఆ చిత్ర విజయం నందిత కెరీర్‌కు బాగా ఉపయోగపడింది. ఆ తరువాత ఎదిర్‌నీశ్చల్‌ వంటి పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించిన నందిత ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. లవ్, హర్రర్‌ మిక్సైన ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది.

అంతే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ప్రస్తుతం అక్కడ నాలుగైదు చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన శ్రీనివాస కల్యాణం చిత్రంలో నితిన్‌కు జంటగా నటించే అవకాశం నందితను వరించింది. ఇందులో పద్మావతిగా గ్రామీణ పాత్రలో నటించానని నందిత చెప్పింది. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే వారం తెరపైకి రానుందని చెప్పింది. ఇందులో పలు సాహసోపేతమైన సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించానని తెలిపింది. అదేవిధంగా తమిళ చిత్రం చతురంగవేట్టై తెలుగు రీమేక్‌లోనూ తాను హీరోయిన్‌గా నటించానని చెప్పింది. అదే విధంగా తమిళం చిత్రం డార్లింగ్‌–2 తెలుగులో ప్రేమ కథా చిత్రం 2గా తెరకెక్కుతోందని, అందులోనూ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిపింది. ఇకపోతే తమిళంలో వైభవ్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, నర్మద అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. అదే విధంగా కన్నడంలో ఒక ప్రముఖ హీరోకు జంటగా నటించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుందని తెలిపింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా నందిత బిజీబిజీగా ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు