నా కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ సవారి

7 Jul, 2019 00:56 IST|Sakshi
ప్రియాంక, సాహిత్,సంతోష్, నందు, తరుణ్‌ భాస్కర్‌

– నందు

‘‘తెలుగు తెరపై కొత్త కథలు వస్తున్నాయి. సాహిత్‌ ఎంచుకొన్న కథ డిఫరెంట్‌గా ఉంది. దాన్ని తెరపై బాగా చూపించి ఉంటారనే నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమా చక్కటి బ్రేక్‌ ఇస్తుంది అనుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ‘బంధం రేగడ్‌’ అనే ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌తో గుర్తింపు పొందిన సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సవారి’. సంతోశ్‌ మోత్కూరి, నిశాంక్‌ కుడితి నిర్మించారు. నందు, ప్రియాంకా శర్మలు జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్, ప్రణయ్‌రెడ్డి వంగా, టి.ఎన్‌.ఆర్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. ‘సవారి’ నా కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌. సాహిత్‌ ఓ కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నా బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్‌ ఈ సినిమాకు కరెక్ట్‌గా సెట్‌ అయ్యాయి’’ అన్నారు. సాహిత్‌ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. హీరో పాత్ర విభిన్నంగా ఉంటుంది. నందు ఈ పాత్రకు బాగా సెట్‌ అయ్యాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో నందు నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేశాడు. ఈ సినిమాలో నేను చాలెంజింగ్‌ రోల్‌ చేశాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన సాహిత్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు ప్రియాంకా శర్మ.

మరిన్ని వార్తలు