నాని అభిమానులకు గుడ్‌న్యూస్‌

24 Feb, 2020 19:01 IST|Sakshi

పాతికపైగా చిత్రాల్లో నటించిన 'నాని' తన సహజ నటనతో నేచురల్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అతని 27వ చిత్రానికి సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. ‘జెర్సీ’ వంటి ఘనవిజయం అందించిన యువ నిర్మాత నాగవంశీ మరోసారి నానికి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆయన హీరోగా మరో చిత్రాన్ని ఖరారు చేశారు. 'టాక్సీ వాలా' చిత్ర దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు 'శ్యామ్ సింగ రాయ్' అనే పేరును ఖరారు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. (హిట్‌ సినిమా టీజర్‌ విడుదల)

నేడు అతని పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్రయూనిట్‌ ఓ వీడియోను విడుదల చేసింది. పనిలో పనిగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తామని రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించేసింది. టైటిల్‌ అదరహో అంటూ నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోది డబుల్‌ రోల్‌ అని కొందరు, లేదు.. ట్రిపుల్‌ రోల్‌ అని మరికొందరు సోషల్‌ మీడియాలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సినిమా యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సమర్పణ పి.డి.వి.ప్రసాద్. ప్రస్తుతం నాని నటించిన ‘వి’ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. (వి టీజర్‌ను వీక్షించండి)

(హిట్‌ ఇస్తున్నందుకు గర్వంగా ఉంది)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు