స్పీడ్‌ పెంచిన హీరోలు

23 Feb, 2018 00:10 IST|Sakshi
రాశీఖన్నా, వరుణ్‌ తేజ్‌

రెండు మూడేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు హీరోలు స్పీడ్‌ పెంచారు. ఒకేసారి రెండు సినిమాలు లేదా ఒకే సినిమాని త్వరగా పూర్తి చేయడం చేస్తున్నారు. దానివల్ల థియేటర్ల కొరత ఏర్పడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల ‘దిల్‌’ రాజు ప్రస్తావించారు. ఎన్ని ఎక్కువ సినిమాలు వస్తే అంత మంచిదే కానీ, రిలీజ్‌ విషయంలో అండర్‌స్టాండింగ్‌తో వెళ్లాలి. నిర్మాతలందరూ దాదాపు అలానే వెళుతున్నారు. ఫర్‌ ఎగ్జాంపుల్‌ ఫిబ్రవరి 9  గురించి మాట్లాడుకోవాలి. ఒకటి కాదు.. రెండు కాదు.

ఏకంగా ఐదు సినిమాలు ఫిబ్రవరి 9న బాక్సాఫీస్‌ వార్‌కు రెడీ అయ్యాయి. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్‌తేజ్‌ ‘తొలిప్రేమ’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ఇంటిలిజెంట్‌’, నిఖిల్‌ ‘కిర్రిక్‌ పార్టీ’, నాగశౌర్య ‘కణం’ అదే రోజున రిలీజ్‌ కావాల్సింది. కానీ.. గాయత్రి, ఇంటిలిజెంట్‌ మాత్రమే ఫిబ్రవరి 9న థియేటర్‌లోకి వచ్చాయి. ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్‌ ప్రసాద్, ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్‌ ‘దిల్‌’ రాజు తమ ‘తొలిప్రేమ’ సినిమాను ఒక్క రోజు వాయిదా వేశారు. అంటే.. ఫిబ్రవరి 10న వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’ రిలీజైంది.  

‘ఇంటిలిజెంట్‌’ నిర్మాత సి. కల్యాణ్, ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్, డిస్ట్రిబ్యూటర్‌ రాజు.. ముగ్గురూ చర్చించుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు ఒకేరోజు సినిమాలు రిలీజ్‌ అవుతుంటే.. ఒక సినిమా హీరో, ఇంకో సినిమా హీరోకు సోషల్‌ మీడియాలో ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. అఖిల్‌ హీరోగా నాగార్జున నిర్మాణంలో వచ్చిన ‘హలో’, ‘దిల్‌’ రాజు నిర్మాతగా నాని హీరోగా వచ్చిన ‘ఎమ్‌సీఏ’ విషయం అప్పుడు ఇలానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇటీవల ‘మనసుకు నచ్చింది’ రిలీజ్‌ అప్పుడు చిత్రకథానాయకుడు సందీప్‌ కిషన్‌.. నాని నిర్మించిన ‘అ!’కి శుభాకాంక్షలు చెబితే.. నాని టీమ్‌ వీళ్లకు
ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

                                 సాయిధరమ్‌ తేజ్, లావణ్యా త్రిపాఠి

మరిన్ని వార్తలు