నెక్ట్స్‌ ఏంటి?

15 Nov, 2019 05:14 IST|Sakshi
నానీ

ఏదైనా సినిమా పూర్తవగానే, లేదా పూర్తయ్యే సమయం నుంచి యాక్టర్స్‌కి వినిపించే మాట నెక్ట్స్‌ ఏంటి?. ‘నేను లోకల్‌’ సినిమాలో ‘నెక్ట్స్‌ ఏంటి’ టాపిక్‌పై నాని సరదాగా ఓ పాట కూడా పాడుకున్నారు. ఇప్పుడు నానీని నెక్ట్స్‌ ఏంటి? అని అడిగితే.. నూతన దర్శకుడితో ఓ సినిమా ఉండబోతోంది అని తెలిసింది. నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణతో నాని సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. తాజాగా మహేశ్‌ అనే కొత్త దర్శకుడితో ఆయన ఓ సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. మరి.. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా