హిట్‌ కాంబినేషన్‌

29 Nov, 2019 03:43 IST|Sakshi

హీరో నాని తర్వాతి చిత్రం ఖరారైంది. నానీతో ‘నిన్ను కోరి (2017), నాగచైతన్య, సమంతతో మజిలీ (2019)’ సినిమాలను తెరకెక్కించి, మంచి జోష్‌ మీద ఉన్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘మజిలీ’ నిర్మాతలు  సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగనుంది. నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్ను కోరి’ మంచి హిట్‌ కావడంతో తాజా సినిమాపై అంచనాలు నెలకొనడం సహజం. ఆ అంచనాలను రీచ్‌ అయ్యేలా కథ తయారు చేశారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా