బిగ్‌ బాస్‌-2: నాని తగ్గట్లేదు బాస్‌

21 Jun, 2018 16:56 IST|Sakshi
బిగ్‌బాస్‌-2 హోస్ట్‌ నాని

గతేడాది వచ్చిన బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. దానికి మొదటి కారణం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడమే. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్‌ నడిపిన తీరే ఈ షో సక్సెస్‌కు ప్రధాన కారణం. బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌కు ఎన్టీఆర్‌ కాకుండా నాని హోస్ట్‌గా ఫిక్స్‌ అయ్యాక కొందరు నిరాశపడినా, మరికొందరు నాని కూడా తన సహజత్వంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలడని ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ షోకు విశేష స్పందన లభించిందని తెలుస్తోంది. 

బిగ్‌బాస్‌ సీజన్‌-2 మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్‌ను నిర్వాహకులు కాసేపటి క్రితమే విడుదల చేశారు. 15.1 రేటింగ్‌తో ప్రారంభమైందని తెలిపింది. టీవీ కార్యక్రమానికి సంబంధించి ఈ రేంజ్‌లో రావడం అరుదే. మొదటి సీజన్‌ సమయంలో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసినప్పుడు 16 పాయింట్లతో ఆందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే నాని తన స్థాయిలో ఈ షోను విజయవంతం చేయటం గమనార్హం. ఈ షో ప్రారంభం రోజున ప్రతి ఇ‍ద్దరిలో ఒకరు చూశారని, ఓవరాల్‌గా మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 శాతం మంది షోను చూశారని స్టార్‌ మా ప్రకటించుకుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు