బిగ్‌ బాస్‌ ఫిక్స్‌

16 May, 2018 01:20 IST|Sakshi

బిగ్‌ బాస్‌ ఫస్ట్‌ సీజన్‌ సందడి సందడిగా సాగింది. ఆడియన్స్‌ మనసులను కొల్లగొట్టింది. ఈ షో ఇచ్చిన కిక్‌తో ఇప్పుడు అందరూ సెకండ్‌ సీజన్‌ కోసం వెయిటింగ్‌. ‘బిగ్‌ బాస్‌ 2’ షోని ఎంజాయ్‌ చేయడానికి రెడీ అయిపోతున్నారు. మరి.. ఫస్ట్‌ సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేశారు కదా.. సెకండ్‌ సీజన్‌ ఎవరు చేస్తారు? అంటే.. ‘నానీ’ అని కొన్ని రోజుల క్రితం ‘సాక్షి’ ప్రచురించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో రెండు మూడు రోజుల్లో హోస్ట్‌ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

యస్‌.. నానీయే చేయబోతున్నారట. ఆల్రెడీ టీజర్, ఫొటోషూట్‌ కూడా కంప్లీట్‌ అయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండో బిగ్‌ బాస్‌ షో జూన్‌లో మొదలు కానుంది. ప్రస్తుతం పార్టిసిపెంట్స్‌ సెలక్షన్‌ జరుగుతోందట. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌ వర్క్‌ జరుగుతోంది. 

మరిన్ని వార్తలు