నాన్నవుతున్నాడోచ్!

12 Dec, 2016 14:49 IST|Sakshi
నాన్నవుతున్నాడోచ్!

యస్.. మీరు చదువుతోంది నిజమే. న్యాచురల్ స్టార్ నాని త్వరలో నాన్న కాబోతున్నారు. అంజన (నాని భార్య) ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. దంపతులు ఇద్దరూ ఆదివారం స్నేహితులందర్నీ ఆహ్వానించి స్వగృహంలో పార్టీ ఇచ్చారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత, 2012 అక్టోబర్ 27న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్‌మన్’, ‘మజ్ను’... రానున్న ‘నేను లోకల్’తో వరుసగా మంచి సినిమాలతో జోరు మీదున్న ఈ హీరో కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఇది తీపి వార్తే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నాని కూడా ఫుల్ హ్యాపీ.