‘వెళ్లి స్నానం చేసి వస్తాను...పెళ్లి చేసుకుందాం’

21 Mar, 2019 16:27 IST|Sakshi

నేచురల్‌ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్థా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

ఇప్పటికే టీజర్‌తో పాటు లిరికల్‌ వీడియోలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ హోలీ సందర్భంగా మరో ఇంట్రస్టింగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ టీజర్‌ను నాని తన సోషల్‌ మీడియా పేజ్‌ లో షేర్‌ చేశాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని.. క్రికెటర్‌ అర్జున్‌ పాత్రలో కనిపించనున్నాడు.

మరిన్ని వార్తలు