నాని రెడీ.. సెన్సార్ కూడా అయిపోయింది

16 Dec, 2017 10:52 IST|Sakshi

2017కు సక్సెస్ తో గుడ్ బై చెప్పేందుకు యంగ్ హీరో నాని రెడీ అయిపోయాడు. ఈ ఏడాది వరుస విజయాలతో సత్తా చాటిన నాని మరోసారి ఎమ్‌సీఏతో అదే జోరును కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆడియోతో పాటు టీజర్, ట్రైలర్ లకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ప్రొడక్షన్,పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర‍్తి చేసుకున్న ఈసినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. నాని సరసన ఫిదా ఫేం సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.

మరిన్ని వార్తలు