మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి ముందే వస్తున్నాడు..!

28 Oct, 2017 11:44 IST|Sakshi

వరుస విజయాలతో ఫుల్‌ ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎమ్సీఏ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి). వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ మూడోవారంలో క్రిస్టమస్‌ కానుకగా రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘హలో’ రిలీజ్‌ కూడా ఉండటంతో నాని రేసు నుంచి తప్పుకున్నాడు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వారం​ ముందుగానే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్‌ 21న కాకుండా డిసెంబర్‌ 15నే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాని తన విజయపరంపర కొనసాగిస్తాడని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్‌. అందుకే ఎలాంటి రిస్క్‌ లేకుండా వారం​ ముందుగానే థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా