మనాలీ పోదాం

14 Oct, 2019 00:19 IST|Sakshi
నాని

ఫైట్‌ కోసం మనాలీలో మకాం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ‘వి’ టీమ్‌. సుధీర్‌బాబు, నాని ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు.

ఇందులో పోలీసాఫీర్‌ పాత్రలో సుధీర్‌బాబు, విలన్‌ పాత్రలో నాని నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్‌ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ముఖ్యంగా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్‌ మనాలీలో జరగనుంది. అక్కడ కూడా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారట చిత్రబృందం. ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా