నాని 'నేను లోకల్' ఫస్ట్ లుక్

29 Oct, 2016 10:22 IST|Sakshi
నాని 'నేను లోకల్' ఫస్ట్ లుక్

యంగ్ హీరో నాని యమా స్పీడు మీద ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసిన నాని, మరో సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నేను లోకల్. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. నాని ఫుల్ మాస్ లుక్ లో సిగరెట్ తాగుతున్న ఈ స్టిల్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న నేను లోకల్ ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.