నానీని ఇబ్బంది పెడుతున్న రామ్చరణ్

12 Dec, 2016 15:03 IST|Sakshi
నానీని ఇబ్బంది పెడుతున్న రామ్చరణ్

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని ప్రస్తుతం నేను లోకల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి నాని సినిమా రిలీజ్ కాకుండా రామ్చరణ్ అడ్డుపడుతున్నాడట. అంటే రామ్ చరణ్ నానికి సినిమా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడని కాదు. ధృవ సినిమా రిలీజ్ కూడా ఇదే నెలలో ఉండటంతో ఇతర సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఇబ్బందులు తప్పటం లేదు.

డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ధృవ సినిమాతో భారీ కలెక్షన్లను టార్గెట్ చేశాడు రామ్ చరణ్. అందుకే సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా పెద్ద సినిమాలేవి అడ్డు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా డిసెంబర్ 16న రిలీజ్ కావాల్సిన సూర్య సింగం 3 సినిమాను వారం పాటు వాయిదా వేయించాడు. దీంతో సింగం 3 డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగం వాయిదా పడటంతో డిసెంబర్ 23న రావాల్సిన నాని, నేను లోకల్ రిలీజ్ విషయంలో కూడా డైలమా ఏర్పడింది. సింగంతో పోటి పడాలా.. లేక తను కూడా సినిమాను వాయిదా వేసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నాడు నేచురల్ స్టార్.