ఫస్ట్ లుక్కే ఫుల్ మార్క్స్

23 Feb, 2017 16:29 IST|Sakshi
ఫస్ట్ లుక్కే ఫుల్ మార్క్స్

యంగ్ హీరో నాని ఇప్పుడు ఫుల్ ఫాం లో ఉన్నాడు. మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ తోనే వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు. అదే సమయంలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ లతో సత్తా చాటిన నాని, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా రెడీ చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడు.

నేను లోకల్ రిలీజ్కు ముందే ప్రారంభమైన ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ లను గురువారం రిలీజ్ చేశాడు. నాని ట్విట్టర్ ద్వారా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్తో మరోసారి ఫుల్ మార్క్స్ కొట్టేశాడు నాని. 'నిన్ను కోరి'  అనే టైటిల్తో పాటు నాని లుక్ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.