వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

4 Nov, 2019 10:50 IST|Sakshi

వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో నాని. తాజాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నాని 25వ చిత్రం. నాని ఎక్కువగా యాక్షన్‌ సీన్స్‌ ఉండే సినిమాలు చేయడని.. కొందరు ఆయనపై విమర్శలు కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసమే నాని చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది.

వయొలెన్స్‌ కావాలన్నారుగా, ఇస్తా ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అని నాని ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా గన్స్‌తో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అని విలియం షేక్‌స్పియర్ కోట్స్‌ను ఉంచారు. వచ్చే ఏడాది ఉగాది కానుగా మార్చి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్టు సమాచారం. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మరో హీరో సుధీర్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అదితిరావు హైదరీ, నివేదా థామస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిట్‌తోనే నాకు గుర్తింపు

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

ట్యూన్‌ కుదిరింది

ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం

నీవెవరు?

చైనీస్‌కు దృశ్యం

రాజీ పడేది లేదు

కేసులు ఇవ్వండి ప్లీజ్‌

త్రీఇన్‌ వన్‌

అతిథిగా ఆండ్రియా

డైరెక్షన్‌ వైపుకి స్టెప్స్‌?

డిష్యుం.. డ్యూయెట్‌

రచయితలే లేకపోతే మేము లేము

ఆ హీరోయన్‌కు ‘మెగా’ ఆఫర్‌

షారుక్‌ అండ్‌ ది సైంటిస్ట్‌

బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌

బిగ్‌బాస్‌లోకి మెగాస్టార్‌.. హీటెక్కిన షో!

బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే!

20 లక్షల ఆఫర్‌.. హౌజ్‌లో టెన్షన్‌ రేపిన శ్రీకాంత్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె: ఫస్ట్‌ ఎలిమినేషన్‌ అతడే!

బాలీవుడ్ బాద్‌షాకు అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

ప్రధాని మోదీపై ఎస్పీ బాలు అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వయలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌