ఈ ఉగాదికి హింసే!

5 Nov, 2019 00:13 IST|Sakshi
నాని

‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అన్నాడు షేక్‌స్పియర్‌. అదే నేనూ అంటున్నాను. శత్రువులందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటున్నారు నాని. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీ రావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వయొలెన్స్‌ (హింస) కావాలన్నారుగా. ఇస్తాను. ఉగాదికి సాలిడ్‌గా ఇస్తాను’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు నాని. ఈ సినిమాలో సుధీర్‌బాబు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో, నాని విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం కూడా కావడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అమిత్‌ త్రివేది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు