నేను లోకల్ అంటున్న నాని

1 Jul, 2016 12:17 IST|Sakshi
నేను లోకల్ అంటున్న నాని

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, అదే జోరులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇటీవల విడుదలైన థ్రిల్లర్ మూవీ జెంటిల్మన్ కూడా హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఇప్పుడు తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని.  రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'మజ్ను' అనే టైటిల్ను ఫైనల్ చేశారు.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా సినిమా చూపిస్త మామా ఫేం త్రినాథ్ రావు దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'నేను లోకల్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. కొద్ది రోజులుగా ప్రయోగాత్మక చిత్రాలు, క్లాస్ చిత్రాలు మాత్రమే చేస్తున్న నాని, ఈ సినిమాతో మాస్ మాసాలా అవతారంలో కనిపించనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి