పవన్ పక్కకు చేరిన నాని

15 Feb, 2017 14:02 IST|Sakshi
పవన్ పక్కకు చేరిన నాని

డబుల్ హ్యాట్రిక్ హిట్స్తో టాలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. తాజాగా నేనులోకల్ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న నాని.. ఓవర్ సీస్ మార్కెట్లో సత్తా చాటుతున్నాడు. తెలుగు మార్కెట్లో ఫాం చూపిస్తున్న ఈ యంగ్ హీరో ఓవర్సీస్లో మాత్రం టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్నాడు.

ఓవర్ సీస్ మార్కెట్లో అత్యధిక సార్లు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోల లిస్ట్లో మూడో స్థానంలో నిలిచాడు నాని. ఆరు మిలియన్ డాలర్ల సినిమా(దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనోక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం)లతో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉండగా.. నాలుగు సినిమా(బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్)లతో ఎన్టీఆర్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఆ తరువాత స్థానంలో మూడు సినిమా(అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్థార్ గబ్బర్సింగ్)లతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేనులోకల్ సినిమాతో మూడోసారి వన్ మిలియన్ మార్క్ను దాటి, నాని కూడా పవన్ సరసన చేరాడు. ఈగ సినిమాతో మిలియన్ డాలర్ క్లబ్లో అడుగు పెట్టిన నాని, తరువాత భలే భలే మొగాడివోయ్, నేనులోకల్ సినిమాలతో మరో రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు.