‘ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’

12 Jan, 2019 13:12 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో పిరియాడిక్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. అదే జానర్‌లో తెరకెక్కుతున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ జెర్సీ. వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. తన రేంజ్‌ కు తగ్గ హిట్స్‌ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న నేచురల్‌ స్టార్‌ హీరోగా పిరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న జెర్సీ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. క్రికెట్‌ కావాలనుకునే ఓ వ్యక్తి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని.. అర్జున్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. టీజర్‌ చూస్తే తన కలను నేరవేర్చుకునేందుకు అర్జున్‌ పడిన కష్టాన్ని ఎమోషనల్‌గా తెరకెక్కించనట్టుగా అనిపిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు