‘టీజర్‌ ఎప్పుడు వస్తుందో చెప్పిన నాని’ 

16 Feb, 2020 15:53 IST|Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ కథానాయికలుగా కనిపిస్తున్న ఈ చిత్రాని​కి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్ర బృందం తెలిపింది.  ‘వి’ చిత్ర టీజర్‌ను రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని హీరో నానితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు తమ ట్విటర్‌ ద్వారా తెలిపారు. 

నాని తన 25వ చిత్రంలో పూర్తి నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న రాక్షసుడు పాత్రలో కనిపిస్తుండగా.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రక్షకుడిగా సుధీర్‌ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. 

చదవండి:
నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్‌ తరుణ్‌?
నాని ‘రాక్షసుడు’.. అదిరిపోయింది

​​​​​​​

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు