హిట్‌ లుక్‌

26 Dec, 2019 00:50 IST|Sakshi

హీరోగా నాని సూపర్‌ సక్సెస్‌ఫుల్‌. నిర్మాతగా మారి ‘అ!’ చిత్రం తీశారు. ఆ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా రెండో సినిమా కూడా సిద్ధం చేస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్‌’ ఫేమ్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్‌’. నాని సమర్పణలో ప్రశాంత్‌ త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్‌. ‘హిట్‌’ ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రమ్‌ రుద్రరాజు అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా విశ్వక్‌సేన్‌ కనిపించనున్నారు. జనవరి 1న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమాకు కెమెరా: మణికందన్, సంగీతం: వివేక్‌ సాగర్‌.

మరిన్ని వార్తలు