జున్ను కోసం లయన్‌కి డబ్బింగ్‌ చెప్పా

13 Jul, 2019 02:00 IST|Sakshi
అలీ, జగపతిబాబు, నాని, రవిశంకర్‌

– నాని 

‘‘నా గొంతు సినిమాలకు పనికిరాదని చెప్పినవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ, ఇప్పుడు నా గొంతు డిస్నీ సినిమాకు డబ్బింగ్‌ చెప్పే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. జాన్‌ ఫెవరూ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ చిత్రం ‘ద లయన్‌ కింగ్‌’. డిస్నీ వరల్డ్‌ స్టుడియోస్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ముఫాసా, స్కార్, సింబా, నల, పుంబా, టిమోన్‌ పాత్రలకు తెలుగులో రవిశంకర్, జగపతిబాబు, నాని, లిప్సిక, బ్రహ్మానందం, అలీ డబ్బింగ్‌ చెప్పారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘యానిమేషన్‌ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం చాలా కష్టం.

ఎందుకంటే జంతువుల్లోని భావాలు, భావనలకి అతికేలా డబ్బింగ్‌ చెప్పాలి. ఈ యానిమేషన్‌ చిత్రంలోనూ విలన్‌కు డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. అన్ని వయసుల వారినీ మెప్పించే చిత్రమిది’’ అన్నారు. నాని మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది చేస్తున్న సినిమాలన్నీ నా కోసం, ప్రేక్షకుల కోసం. ‘ది లయన్‌ కింగ్‌’కి నా కొడుకు జున్ను కోసం (నాని కుమారుడు అర్జున్‌) డబ్బింగ్‌ చెప్పాను. జంతువుల హావభావాలకి అతికేలా డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నవ్వుకునేవాణ్ని. భావోద్వేగభరితమైన కథతో రూపొందిన ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘డిస్నీవారు తెరకెక్కించిన చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు అలీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌