అష్టా చమ్మా రోజులు గుర్తొచ్చాయి : హీరో నాని

6 Sep, 2016 23:13 IST|Sakshi
అష్టా చమ్మా రోజులు గుర్తొచ్చాయి : హీరో నాని

 ‘‘విరించి వర్మ ‘ఉయ్యాలా జంపాలా’ కథను ఫస్ట్ నాకే చెప్పాడు. అప్పట్నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో, ‘మజ్ను’ అంతకన్నా హిట్ అవుతుంది’’ అని హీరో నాని పేర్కొన్నారు. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ముఖ్య తారలుగా విరించి వర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన చిత్రం ‘మజ్ను’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నాని విడుదల చేసి హీరో రాజ్ తరుణ్‌కు ఇచ్చారు.
 
 నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘దిల్’ రాజు, అనీల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు. నాని మాట్లాడుతూ-‘‘మజ్ను’ అంటే బాధలో ఉండే కథ కాదు. సమస్యల్లో ఉండే ప్రేమికులను మజ్ను అంటుంటాం. ఈ చిత్ర కథాంశం అలాంటిదే. నాకు మళ్లీ ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు తెచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మనం ప్రేమలో ఉన్నప్పుడు అది ఎన్ని రోజులు నిలిచి ఉంటుంది అనే కన్‌ఫ్యూజన్.
 
  మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా ప్రేమా... అనే కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అని విరించి వర్మ చెప్పారు. ‘‘నా కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని నాని చెప్పడం నాకు నిజంగా హ్యాపీ’’ అని గోపీ సుందర్ తెలిపారు. ఈ వేడుకలో పి.కిరణ్, గోళ్ల గీత, దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, మారుతి, హను రాఘవపూడి, కల్యాణ్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి