మెమరబుల్ శంకర

25 Jul, 2013 03:30 IST|Sakshi
మెమరబుల్ శంకర
‘‘ ‘బాణం’, ‘సోలో’ సినిమాల తర్వాత నేను చేస్తున్న మరో మంచి సినిమా ఇది. చాలా అద్భుతమైన కథ.. దీన్ని దర్శకుడు డీల్ చేస్తున్న విధానం కూడా గ్రేట్’’ అని నారా రోహిత్ చెప్పారు. ఆయన హీరోగా తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శంకర’.
 
  కె.యస్.రామారావు సమర్పణలో శ్రీ లీలా మూవీస్ పతాకంపై ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘నారా రోహిత్ కెరీర్‌లో ఇదొక మెమరబుల్ మూవీ అవుతుంది.
 
  ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. వచ్చే నెలలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో రెజీనా కథానాయిక. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సురేందర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ.సునీల్‌కుమార్.