ఈ సారైనా లుక్ మారుస్తాడా..!

7 Dec, 2016 12:22 IST|Sakshi
ఈ సారైనా లుక్ మారుస్తాడా..!

కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. స్టార్ ఇమేజ్ కోసం పోటి పడకుండా, డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తొలి నాళ్లలో బాగానే ఉన్నా తరువాత మాత్రం స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు. మరీ బొద్దుగా తయారైన రోహిత్, చాలా రోజులుగా లుక్ మారుస్తానని చెపుతున్నా ప్రతీ సినిమాలో లావుగానే దర్శనమిస్తున్నాడు.

ఈ మధ్యే ఫిజిక్ మీద దృష్టి పెట్టిన రోహిత్ త్వరలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నారా రోహిత్ జిమ్లో చెమటోడుస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన అప్పట్లో ఒకడుండేవాడుతో పాటు, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కథలో రాజకుమారి సినిమాల్లో కూడా రోహిత్ కాస్త లావుగానే కనిపించే అవకాశం ఉంది. ఆ తరువాత తెరకెక్కబోయే సినిమా కోసమే రోహిత్ న్యూలుక్ ట్రై చేస్తున్నాడట.