నారా రోహిత్ 28వ పుట్టినరోజు నేడు

25 Jul, 2013 12:54 IST|Sakshi
నారా రోహిత్ 28వ పుట్టినరోజు నేడు

చెన్నై: 'బాణం' సినిమాతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన నారా రోహిత్ నేడు 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సోలో, ఒక్కడినే సినిమాల్లో హీరోగా నటించిన రోహిత్.. రవితేజ 'సారొచ్చారు'లో ప్రత్యేక పాత్ర చేశాడు. అతడు తాజాగా నటించిన 'శంకర' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 'శంకర' చిత్రం దాదాపు పూర్తికావొచ్చిందని, త్వరలోనే విడుదలవుతుందని నారా రోహిత్ తెలిపాడు. మరిన్ని విజయాలు అందుకోవాలన్న ఆశాభావాన్ని అతడు వ్యక్తం చేశాడు.

తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న కథానాయకుడు నారా రోహిత్. బాణం, సోలో చిత్రాల ద్వారా నటునిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం మదరాసి, శంకర, లవర్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రోహిత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుధా సినిమాస్ పతాకంపై జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. నూతన దర్శకుడు పరిచయం కానున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీత దర్శకుడు . ప్రస్తుతం ఆ చిత్రం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది.