వీర భోగ వసంత రాయలు : నారా రోహిత్ లుక్

24 Jul, 2018 15:52 IST|Sakshi

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు, శ్రీవిష్ణు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో శ్రియ లుక్‌ను రివీల్‌ చేసిన చిత్రయూనిట్ రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో అతడి లుక్‌ను రివీల్‌ చేశారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో రోహిత్ దివ్యాంగుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి రూమర్స్‌ కు చెక్‌ పెట్టారు చిత్రయూనిట్‌.

కొత్త పోస్టర్‌లో రోహిత్‌ చేతికి కట్టుతో కనిపించాడు. పోస్టర్ లో  ‘హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు