‘కూలీ నెం.1’పై మోదీ ప్రశంసలు

12 Sep, 2019 17:11 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. తాజాగా ఈ చిత్ర యూనిట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దీనికి గల కారణం షూటింగ్‌లో ప్లాస్టిక్‌ వాడకూడదని చిత్ర బృందం నిర్ణయించడమే. దీనిలో భాగంగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు కాకుండా స్టీల్‌ బాటిళ్లనే ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘ప్రధాని పిలుపు మేరకు ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చే ప్రక్రియలో మేం భాగం కావాలని భావించాం. దీనిలో భాగంగా ఇప్పటి నుంచి స్టీల్‌ వాటర్‌ బాటిళ్లనే వాడాలని నిర్ణయించుకున్నాం. చిన్న మార్పుల ద్వారానే మనం అనుకున్నది సాధించవచ్చు’అంటూ హీరో వరుణ్‌ ధావన్‌ ట్వీట్‌ చేశారు. 

అయితే వరుణ్‌ ధావన్‌ ట్వీట్‌కు మోదీ రీ ట్విట్‌ చేశారు. ‘కూలీ నెం 1 చిత్ర బృందం తీసుకున్న నిర్ణ‌యం అద్భుత‌మైనది. ప్లాస్టిక్ ర‌హిత దేశంగా మార్చేందుకు సినీ పరిశ్ర‌మ నుండి ల‌భిస్తున్న మ‌ద్ద‌తు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అంటూ మోదీ కొనియాడారు. ఇక ప్రపంచదేశాలన్నీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ)కి ఇక గుడ్‌ బై చెప్పే సమయం వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు