శ్రీరెడ్డి విషయంలో వాళ్ల నిర్ణయం నచ్చలేదు

3 Sep, 2018 20:21 IST|Sakshi

‘మా’ జనరల్‌ సెక్రటరీ నరేశ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎవరో ఒకరి తప్పుడు నిర్ణయాల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌(మా) నిందలు మోయాల్సి వస్తోందని.. ‘మా’  జనరల్‌ సెక్రటరీ నరేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన నరేశ్‌.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘మా’  అధ్యక్షుడు శివాజీరాజాపై నమ్మకంతో పలు ఒప్పందాలపై సంతకం చేశానని పేర్కొన్నారు. కానీ శివాజీరాజా నిర్ణయాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. నటి శ్రీరెడ్డి విషయంలో ‘మా’  తీసుకున్న నిర్ణయం కూడా తనకు నచ్చలేదన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ‘మా’ కు చేటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహేష్‌ ఈవెంట్‌కు అడ్డుపడను..
‘మా’ జనరల్‌ సెక్రటరీగా తనకు తగిన విలువ ఇవ్వకపోయినా మహేష్‌ బాబు ఈవెంట్‌కు అడ్డుపడని నరేశ్‌ స్పష్టం చేశారు. కళాకారుల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. చిరంజీవి రెండు కోట్ల రూపాయలు ఇస్తానన్నా.. కోటి రూపాయలకే ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని నరేశ్‌ అన్నారు. అయినా చిరంజీవి, మహేష్‌, ప్రభాస్‌ ఈవెంట్లు లోకల్‌లో జరిగినా 5 కోట్ల రూపాయలు వస్తాయని.. మరి వారి ఈవెంట్లు అమెరికాలో ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదని సందేహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు