దీపిక ధైర్యాన్ని ప్రశంసించిన నటుడు

22 Jan, 2020 18:58 IST|Sakshi

ముంబై: సీనియర్‌ నటుడు, దర్శకుడు నసీరుద్దీన్‌ షా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనెను ప్రశంసించారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్ధీన్‌ పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఢిల్లీ విద్యార్థుల నిరసనలు గురించి విపులంగా చర్చించారు. అలాగే దీపికా జేఎన్‌యూను సందర్శించడాన్ని ఆయన అభినందించారు. ఇటీవల ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీలో జరిగిన దుండగుల దాడి అనంతరం దీపిక అక్కడికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించిన విషయం తెలిసిందే. అదోక సాహోసోపేత చర్యగా నసీర్‌ అభివర్ణించారు. అదే విధంగా జేఎన్‌యూ సందర్శన తర్వాత దీపిక ఆదరణ తగ్గదని పేర్కొన్నారు. (దీపికపై కంగనా ఘాటు వ్యాఖ్యలు)

అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వలన ఒక సెలబ్రిటీ భవిష్యత్తుకు హాని కలిగించదా అని ప్రశ్నించగా.. ‘నటుడు కేవలం తన గురించే ఆలోచిస్తాడు. అయితే దీపిక జేఎన్‌యూని సందర్శించింనందుకు ఆమె ధైర్యాన్ని ప్రశంసించాలి. ఆమె ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో ఉంది. ఈ చర్య వల్ల తనకు నష్టం జరుగుతుందని తెలిసినా ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసింది. దీపికకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు త్వరలోనే ఇవన్నీ మరిచిపోతారు. ఆమె దీనిని ఎలా స్వీకరిస్తుందో, ఈ నిర్ణయం ఆమె పాపులారిటీని తగ్గిస్తుందా.. ఇలాంటి విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఆరాధించే ఏకైక దైవం డబ్బు మాత్రమే’ అని నసీరుద్దీన్‌ తెలిపారు. కాగా నవంబరులో సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును సవాలు చేస్తూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని కొంతమంది న్యాయవాదులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన 100 మంది ముస్లింలలో నసీరుద్దీన్ ఒకరు.  వివాదాన్ని ఇలాగే కొనసాగించడం ద్వారా  సమాజానికి హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

చదవండి :నిజం తెలుసుకొని షాకైన హీరోయిన్‌!

ఛపాక్‌ ఎఫెక్ట్‌: యాసిడ్‌ బాధితులకు పెన్షన్‌!

మరిన్ని వార్తలు