లక్ష్యం కోసం...

25 Sep, 2018 04:10 IST|Sakshi
ఆశిష్‌ గాంధీ

‘‘నాది హైదరాబాద్‌. సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే చదువు మధ్యలోనే ఆపేశా. మోడలింగ్‌తో పాటు కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించా. వాటిద్వారా వచ్చిన గుర్తింపే ‘పటాస్, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల్లో చాన్స్‌ తెచ్చిపెట్టింది. హీరోగా ‘నాటకం’ నా తొలి సినిమా’’ అని ఆశిష్‌ గాంధీ అన్నారు. ఆయన హీరోగా ఆషిమా కథానాయికగా కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో శ్రీ సాయిదీప్‌ చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. 

ఆశిష్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఏడేళ్లుగా నేను పడుతున్న కష్టాలు చూసి, నటుడిగా నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలని మా అన్నయ్య ‘నాటకం’ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో బాలకోటేశ్వరరావు అనే యువకుడి పాత్ర చేశా. బరువు బాధ్యతలు లేకుండా తిరిగే ఆ యువకుడు అనుకోకుండా ఓ లక్ష్యాన్ని ఎంచుకుంటాడు. ఆ లక్ష్యం ఏంటి? దాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది ఆసక్తికరం. కథానుగుణంగానే రియలిస్టిక్‌గా, బోల్డ్‌గా తెరకెక్కించాం. లవ్‌స్టోరీ కూడా ఉంది. బాలకోటేశ్వరరావు, పార్వతిల స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం నిదర్శనం’’ అన్నారు.

మరిన్ని వార్తలు