ఫిబ్రవరిలో నటసార్వభౌమ

3 Jan, 2019 04:24 IST|Sakshi
పునీత్‌ రాజ్‌కుమార్‌

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘నట సార్వభౌమ’. అనుపమా పరమేశ్వరన్, రచితారామ్‌ కథానాయికలుగా నటించారు. రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించారు. పవన్‌ వడయార్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుందన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిందని శాండిల్‌వుడ్‌ సమాచారం. ఇందులో అనుపమ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పునీత్‌ హీరోగా రూపొందనున్న నెక్ట్స్‌ చిత్రం ‘యువరత్న’. ఇందులో స్టూడెంట్‌ పాత్ర పోషిస్తున్నారట పునీత్‌.

మరిన్ని వార్తలు