ఈ పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రూ విజేత‌లే

8 Jun, 2020 14:28 IST|Sakshi

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య త‌హీర క‌శ్య‌ప్ గ‌తేడాది రొమ్ము క్యాన్స‌ర్‌ను జ‌యించింది. అప్ప‌టి నుంచి ఆమె సోష‌ల్ మీడియాలో క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించే పోస్టుల‌ను పెడుతూ వ‌స్తోంది. తాజాగా "నేష‌నల్ క్యాన్స‌ర్ స‌ర్వైవ‌ర్స్ డే" సంద‌ర్భంగా ఓ ఆడియో సందేశాన్ని అభిమానుల‌తో పంచుకుంది. "కొన్ని గాట్లు లోతైన‌వి, కొన్ని క‌నిపిస్తాయి, మ‌రికొన్ని క‌నిపించ‌వు. కానీ ఆ మ‌చ్చ‌లు మీకు గ‌తాన్ని గుర్తు చేస్తాయి. మీరు బాధ‌ అనుభ‌వించిన క్ష‌ణాల‌ను గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ మీ శ‌రీరంపై ఉన్న మ‌చ్చ‌లున్నాయే.. అవి దూరంగా ఉన్న‌ న‌క్ష‌త్రాల లాగే ర‌హ‌స్యాల‌ను దాచిపెడ‌తాయి. అయితే ఈ ర‌హ‌స్యాల‌ను కంటితో చూడ‌లేరు. ఇందులో ప్ర‌పంచాన్ని విస్మ‌రించే క‌ఠోర‌మైన అబ‌ద్ధం దాగి ఉంటుంది.. (మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య)

ఇక ఈ మ‌చ్చ‌లు మ‌న‌కు ఎన్నో నేర్పుతాయి. పోరాటం, శ‌క్తి సామ‌ర్థ్యాలు అన్నీ.. ఆరోగ్య క‌ర్మ‌తో పోరాడే ప్ర‌తి ఒక్క‌రూ విజేత‌లే. ఎలాగంటే ఈ పోరాటం మిమ్మ‌ల్ని అనుభ‌వ‌జ్ఞులుగానో లేదా యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నార‌నో తెలుపుతుంది. అయితే క్యాన్స‌ర్‌తో పోరాటం శారీర‌కంగానే కాదు, మాన‌సికంగానూ ఉంటుంది. కొన్ని యుద్ధాలు జ‌యించ‌డానికి ఎంతో క‌ష్టంగా ఉంటాయి. ముఖ్యంగా అవి అంత‌ర్గ‌త‌మైన‌పుడు! కానీ ఓ మాట గుర్తుంచుకోండి. మ‌నంద‌రికీ విశ్వ‌మంత‌టి శ‌క్తి ఉంది. కాబ‌ట్టి మీరు మ‌చ్చ‌ల‌ను దాచ‌కండి, వాటిని చూపించండి.. మీ ఆత్మ‌గౌర‌వానికి ఇత‌రులే ప్రేమలో ప‌డుతారు. మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోండి" అని చెప్పుకొచ్చింది. (నేను కాస్టింగ్‌ కౌచ్‌‌ను ఎదుర్కొన్నా: హీరో)

A small something I have written.... #nationalcancersurvivorsday . . Some scars are deep, some within, Some are seen while some are hidden. The thing about scars is , it reminds you of the past, The moments of suffering that you thought would forever last. But there’s more to these Goddamn scars, They are Secrets hidden far away, just like the stars. It’s the Truth which you don’t see with the naked eye, Oblivious to the functioning of the world, a blatant lie. But hear me, there’s more to this scar, It talks also about the fight, the resilience and your invincible power. My love and respect to those who fought, The treacherous battlefield that Few crossed while some got lost. But the thing with this health karma is that everyone is a winner, For it’s the fight that counts whether you an expert or a beginner. The fight with cancer is not just physical but also mental, Some battles are more tough to conquer especially if they are internal. But hear me again, we all have that fighter which has the universe’s might, The indomitable spirit that can’t be crushed by any fright. Hide not your scars my love, Show them, flaunt them, just like your bright smile, soothing to others eyes, And when you do that time and again giving people nowhere to run and hide, they will have to fall in love with your badge of honour, your prize. So hear me one last time, Fall in love with your self, All with dust, scar and grime. For that’s what make you, YOU Faulty, imperfect, blemished but all true! Lensed by @atulkasbekar who captures the soul! Thank you for this ❤️

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on

మరిన్ని వార్తలు