సినిమాగా ఇందిర జీవిత చరిత్ర

27 Jun, 2013 06:35 IST|Sakshi
సినిమాగా ఇందిర జీవిత చరిత్ర
 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్రతో చిత్రం తెరకెక్కనుంది. తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు నట్టికుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈయన ఇంతకుముందు వెంకటరాం హీరోగా ఫణితుళి చిత్రాన్ని రూపొందించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ జీవిత చరిత్రతో చిత్రం తీయాలన్నది చాలా కాలంగా అనుకుంటున్నానని చెప్పారు. 
 
 ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ తయారవుతోందన్నారు. దీనికి ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్నారు. ఇందిర పాత్ర పోషణకు తన మదిలో హాలీవుడ్ నటి సుసన్ సరండ్రా ఉన్నారని తెలిపారు. కాలం కలిసొస్తే ఆమె ఈ పాత్రలో నటించవచ్చునని అన్నారు. ఇందిర ప్రధాని కావడం, హత్యకు గురైన సంఘటనలు సినిమాలో ఉంటాయని నట్టికుమార్ వెల్లడించారు.