వినోదభరితంగా నవరస తిలకం

4 Apr, 2015 01:44 IST|Sakshi
వినోదభరితంగా నవరస తిలకం

వినోదమే ప్రధానంగా తెరకెక్కిస్తున్న చిత్రం నవరస తిలకం అని ఆ చిత్ర దర్శకుడు కామ్రాన్ అన్నారు. దర్శకుడు రాజ్ కపూర్, భూపతి పాండియన్, ఎస్‌ఎస్ స్టాలిన్‌ల వద్ద శిష్యరికం చేసిన ఈ యన తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం నవరస తిలకం. ఇంతకు ముందు బర్మా చిత్రాన్ని నిర్మించిన స్కోయర్ స్టోన్ ఫిల్మ్సి అధినేత సుదర్శన్ వెంబుట్టి, కే జయచంద్రన్‌తో కలసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎంకేపీ ఆనంద్ హీరో గా, సృష్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కరుణాకరన్, జయ ప్రకాష్, ఇలవరసు, పావా లక్ష్మణన్, మీరా కృష్ణన్, లక్ష్మి, మహాదేవన్, ముఖ్య పాత్రులు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సిద్ధార్థ్‌విప్పిన్ సంగీతాన్ని, రమేష్ చాయాగ్రహణం అందిస్తున్నారు.  చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ, స్నేహితుల పేరుతో తమ చుట్టు కొందరు నవరస నాయకులు ఉంటుంటారన్నారు. అలాంటి  ఒక స్నేహితుడి జీవితంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథగా పేర్కొన్నారు. ఇది 90 శాతం వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుంద ని పేర్కొన్నారు. షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో 60 శాతం పూర్తిచేసినట్టు తెలిపారు. తదుపరి షూటింగ్‌ను తిరుచ్చి, కుంభకోణం ప్రాంతాల్లో జరిపి పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
 
 

>