'ఆ యాడ్ చేయనుగాక చేయను'

17 Sep, 2015 10:57 IST|Sakshi
'ఆ యాడ్ చేయనుగాక చేయను'

ఏ ఆర్టిస్ట్ అయినా స్టార్ ఇమేజ్ రాగానే ఆ ఇమేజ్ ను అడ్డంపెట్టుకోని క్యాష్ చేసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా రెమ్యూనరేషన్ పెంచేయటంతో పాటు, మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా భారీగా సంపాదించేస్తారు.. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖి మాత్రం అలా చేయటం లేదు. భజరంగీభాయ్జాన్, మాంఝీ లాంటి సినిమాలతో ప్రజెంట్ బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ విలక్షణ నటుడు, వచ్చిన ప్రతీ యాడ్ను అంగీకరించకుండా సెలక్టివ్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు

ప్రస్తుతం బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాక సోలో హీరోగా కూడా సత్తా చాటుతున్న నవాజుద్దీన్, ఓ భారీ ఆఫర్ ను కాదన్నాడు. నవాజ్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ కండోమ్ కంపెనీ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని భారీ ఆఫర్ను ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాత్రం మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల తనకున్న గౌరవంతోనే ఈ ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు.