రాత్రి ఒంటరిగా ఉంది!

20 Oct, 2018 01:09 IST|Sakshi

బాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి స్పీడ్‌తో దూసుకెళ్తోన్న యాక్టర్స్‌లో నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ ఒకరు. హీరోగాను,  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటించడానికి ఆలోచించరు నవాజ్‌. కథే అయనకు ముఖ్యం. ఇప్పుడు ఆయన హీరోగా ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. హనీ తెహ్రాన్‌ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు ‘రాత్‌ అఖేలీ హై’ (రాత్రి ఒంటరిగా ఉంది) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని టాక్‌. ఇంతకు ముందు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మక్బూల్, ఓమ్‌కార, సాథ్‌ ఖూన్‌ మాఫ్‌’ సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు హనీ.

అలాగే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు రాధికా ఆప్టేను తీసుకున్నారు. మూడేళ్ల క్రితం నవాజ్, రాధిక కలిసి ‘మాంఝు: ది మౌంటెన్‌ మ్యాన్‌’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కోసం జత కట్టారు రాధిక, నవాజ్‌. ప్రస్తుతం సౌత్‌లో రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న ‘పేట్టా’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు నవాజ్‌. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు