మిస్టర్‌ సింగార్‌ సింగ్‌

7 Dec, 2018 05:12 IST|Sakshi
నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

విలక్షణ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ‘పేట్టా’ సినిమాతో సౌత్‌కు వస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పేట్టా’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, విజయ్‌సేతుపతి, బాబీ సింహా ఇలా ఒక్కొక్కరి లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఇటీవల విజయ్‌సే తుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ లుక్స్‌ను రిలీజ్‌ చేశారు. జీతూ పాత్రలో విజయ్‌సేతుపతి నటించగా, సింగార్‌ సింగ్‌ పాత్రలో నవాజ్‌ కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలోని ‘మరణ మాస్‌..’ అనే సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఇప్పుడు ఈ సినిమాలోని మరో సాంగ్‌ ‘ఉల్లాలా...’ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్‌ కానుంది. త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాష్, మాళవికా మోహనన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరకర్త.

మరిన్ని వార్తలు