న‌వాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం నుంచి బెదిరింపులు

5 Jun, 2020 21:03 IST|Sakshi

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ త‌మ్ముడు త‌న‌ను లైంగికంగా వేధించాడంటూ సిద్ధిఖీకి వ‌ర‌స‌కు‌ కూతుర‌య్యే మ‌హిళ  పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ ఫిర్యాదు వెన‌క్కు తీసుకోవాల‌ని న‌వాజుద్దీన్ కుటుంబ స‌భ్యులు బెదిరిస్తున్నార‌ని ఆమె మీడియా ముందు వాపో‌యారు. కేసు వాప‌సు తీసుకోకుంటే త‌న కుటుంబాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తామంటున్నార‌ని, ఈ విష‌యం గురించి త‌న‌కు ఆందోళ‌న‌గా ఉంద‌ని ఆమె పేర్కొంది. కాగా  ఐదేళ్ల‌లో మొద‌టిసారి న‌వాజుద్దీన్ త‌న‌ను పిలిచి మాట్లాడార‌‌ని తెలిపింది. (‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’)

"మంగ‌ళ‌వారం రాత్రి పెద్ద‌నాన్న(న‌వాజుద్దీన్ సిద్ధిఖీ) పిలిచి నువ్వు నా కూతురు లాంటి దానివి. నువ్వుంటే నాకెంతిష్ట‌మో నీకూ తెలుసు. ఈ గొడ‌వ‌ల‌న్నీ నాకు తెలియ‌దు, నీకెప్పుడు సాయం కావాల‌న్నా నేను ఉన్నానంటూ మాట్లాడాడు" అని పేర్కొంది. అయితే పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆ కుటుంబం త‌న‌ను పూర్తిగా బ‌హిష్క‌రించింద‌ని తెలిపింది. త‌న‌పై కేసు పెట్ట‌డ‌మే కాక త‌న‌ అత్త‌గారి పైనా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారంది. కాగా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు తొమ్మిదేళ్ల వ‌య‌సులోనే తన‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశాడంటూ కుటుంబ సభ్యుల‌కు చెప్పిన‌ప్ప‌టికీ ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసి‌న సంగ‌తి తెలిసిందే. (‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా